America: అమెరికాలో కాల్పుల కలకలం

America: ఫ్లోరిడాలోని లేక్‌ల్యాండ్‌లో తుపాకీతో సైకో స్వైరవిహారం *సైకో కాల్పుల్లో నలుగురు మృతి

Arun Chilukuri
Updated on: 6 Sept 2021 2:54 PM IST
Again Psycho Gun Firings in America Florida
X

అమెరికాలోని ఫ్లోరిడాలో కాల్పుల మోత (ఫైల్ ఇమేజ్)

America: అమెరికా లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. శని, ఆదివారాల్లో మూడు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. ఫ్లోరిడాలోని లేక్ ల్యాండ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి తుపాకీతో స్వైరవిహారం చేశాడు. అతడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ బాలింతతో పాటు శిశువు కూడా ఉన్నారు. వీరితో పాటు ఓ ఇంట్లోని బాలిక, మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. సైకోను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

హూస్టన్‌లో ఆదివారం ఉదయం ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతిచెందారు. కాల్పుల అనంతరం ఆ ఇల్లు తగలబడింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేశారు. మృతదేహాలను గుర్తించగా, కాల్పుల విషయం వెలుగుచూసింది. మృతుల్లో ఇద్దరు 50ఏళ్ల వయస్సు పైబడినవారు మరో ఇద్దరు పిల్లలు ఉన్నట్టు చెప్పారు. ఇంట్లో జరిగిన గొడవే కాల్పులకు దారి తీసి ఉండొచ్చని భావిస్తున్నారు.

వాషింగ్టన్‌లో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. లాంగ్‌ఫెలో వీధిలోని 600 బ్లాకులో బ్రైట్‌వుడ్‌ పార్కు సమీపంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులకు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు సంబంధించి నల్లటి హోండా అకార్డ్‌ సెడాన్‌ వాహన చిత్రాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేసిన పోలీస్‌ శాఖ నిందితుడిని గుర్తించడంలో స్థానికుల సాయం కోరింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story