Coronavirus: భారత్‌లో మళ్లీ పాజిటివ్‌ పరేషాన్‌

Again Corona Tension In India
x
కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Coronavirus: అమెరికా, బ్రెజిల్‌లను మించి వైరస్‌ ఉద్ధృతి * రోజుకు 80వేలకుపైగా పాజిటివ్‌ కేసులు

Coronavirus: కంటికి కనిపించని శత్రువు మళ్లీ దాడిచేస్తోంది. అవును భారత్‌లో ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్కరోజులో 89వేల 129 కేసులు నమోదయ్యాయి. చెప్పాలంటే అమెరికా, బ్రెజిల్‌లను మించి దేశంలో వైరస్‌ ఉద్ధృతి కనిపిస్తోంది. రోజువారీ మరణాలు ఆరెండు దేశాలకంటే తక్కువే ఉన్నప్పటికీ మునుపటితో పోలిస్తే అవి కూడ ఆందోళన కలిగించే రీతిలో పెరిగాయి.

మహారాష్ట్ర, పంజాబ్‌లలో ఎప్పుడూ లేనన్ని ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మరో 19 రాష్ట్రాల్లో గత రెండు వారాలను మించి గరిష్ఠ సంఖ్యలో కేసులు రికార్డయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తమిళనాడుతోపాటు కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోనూ పరిస్థితులు రోజురోజుకు తీవ్రంగా తయారవుతున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 15 వరకు రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మద్యం విక్రయాలు నిలిపివేస్తామని హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు హెచ్చరించారు.

పూణెలో సైతం పాజిటివ్‌ కేసులు పెరగడంతో అధికారులు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఏడు రోజుల పాటు బార్లు, హోటళ్లుతోపాటు రెస్టారెంట్లు, థియేటర్లను మూసివేశారు. ఇక కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గెజిటెడ్‌ సెలవు రోజులు సహా ఏప్రిల్‌ నెల అన్ని రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ను కొనసాగించాలని రాష్ట్రాలకు తెలియజేసింది. వేసవికాలంలో చల్లగా ఉండే ఏసీ గదుల్లో గడపడం ప్రజలు తగ్గించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

కరోనా సెకండ్‌ వేవ్‌ పంజా విసురుతోన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ కేసుల ట్రేసింగ్‌ కోసం కొత్త యాప్‌ తెచ్చింది. ట్రేసింగ్‌-టెస్టింగ్‌-ట్రీటింగ్‌ విధానంలో కరోనా కట్టడి కోసం ఈ కొత్త యాప్‌ రూపొందించింది వైద్య ఆరోగ్య శాఖ. పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల కాంటాక్ట్‌ పర్సన్స్‌కి వెంటనే మొబైల్‌ ద్వారా కరోనా పరీక్ష చేయించుకోవాలని ఎస్‌ఎంఎస్‌ పంపించే విధంగా నూతన యాప్‌ రూపకల్పన చేశారు. దీంతో ట్రేసింగ్‌ తొందరగా చేయడానికి వీలవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories