Abhishek Manu Singhvi Covid19 Positive: కాంగ్రెస్‌ సీనియర్‌ నేతకు కరోనా పాజిటివ్‌

Abhishek Manu Singhvi Covid19 Positive: సుప్రీంకోర్టు ప్రఖ్యాత సీనియర్ న్యాయవాది, పార్లమెంటు సభ్యుడు అభిషేక్ మను సింగ్వి కరోనా భారిన పడ్డారు.

Raj
By Raj
Published on: 26 Jun 2020 2:17 PM IST
Abhishek Manu Singhvi Covid19 Positive: కాంగ్రెస్‌ సీనియర్‌ నేతకు కరోనా పాజిటివ్‌
X

Abhishek Manu Singhvi Covid19 Positive: సుప్రీంకోర్టు ప్రఖ్యాత సీనియర్ న్యాయవాది, పార్లమెంటు సభ్యుడు అభిషేక్ మను సింగ్వి కరోనా భారిన పడ్డారు. ఆయనకు ఇటీవల పరీక్షలు నిర్వహించగా COVID 19 కు పాజిటివ్ అని తేలింది. దాంతో జూలై 9 వరకు హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నట్టు చెప్పారు. జూన్ 23 న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తను డీల్ చేస్తున్న కేసును సుప్రీంకోర్టులో వాదించారు. ఆ సమయంలో సింగ్వికి తేలికపాటి COVID 19 లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు.

దాంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. సాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించగా కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. దాంతో ఆయన తన నివాసంలోనే నిర్బంధంలో ఉన్నారు. కాగా అభిషేక్ మను సింఘ్వి సత్వరమే కోలుకోవాలని సుప్రీంకోర్టు న్యాయవాదులు, కాంగ్రెస్‌ నేతలు ఆకాంక్షించారు. ఇదిలావుంటే దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకూ 70390 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మహమ్మారి బారినపడి 2365 మంది మరణించారు. 41437 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Raj

Raj

Next Story