ఢిల్లీ అసెంబ్లీలో నోట్ల కట్టల కలకలం.. కవర్‎లోంచి నోట్ల కట్టలు తీసిన ఆప్ ఎమ్మెల్యే

Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీలో నోట్ల కట్టల కలకలం రేగింది.

Arun Chilukuri
Published on: 18 Jan 2023 3:24 PM IST
AAP MLA Shows Cash Bundles In Delhi Assembly
X

ఢిల్లీ అసెంబ్లీలో నోట్ల కట్టల కలకలం.. కవర్‎లోంచి నోట్ల కట్టలు తీసిన ఆప్ ఎమ్మెల్యే

Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీలో నోట్ల కట్టల కలకలం రేగింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మహేందర్ గోయల్ డబ్బులు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. కవర్లోంచి నోట్ల కట్టలు తీసిన ఆప్ ఎమ్మెల్యే.. అసెంబ్లీలో హంగామా సృష్టించారు. నగర ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ తనకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపించారు. రోహిణిలోని బాబాసాహెబ్ అంబేద్కర్ హాస్పిటల్‌లో తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవడంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

దీనిపై ఫిర్యాదు చేశానని నిందితులు శక్తిమంతులని తనను మౌనంగా ఉంచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీనివల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని గోయల్ ఆందోళన వెలిబుచ్చారు. తాను బెదిరింపులకు లొంగలేదని, ప్రైవేట్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు రక్షణ కావాలని.. ప్రాణాలకు ముప్పు ఉందిని మహేందర్ గోయల్ స్పీకర్‎ను కోరారు. తన దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించాలని ఆప్ ఎమ్మెల్యేకు స్పీకర్ సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story