Viral Video: వామ్మో.. పరధ్యానంలో ఈ మహిళ చెత్త పారేయాలనుకుని ఏమి పడేసిందో చూస్తె షాకే!

Viral Video: ఒక ఫోటో లేదా వీడియో ఇంటర్నెట్‌లో రాత్రిపూట వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఎందరి ఇళ్లకో చేరుకుంటుంది

Sandeep Eggoju
Updated on: 10 Sept 2021 12:46 PM IST
A woman Throughed kid Instead of Dust in Dust bin Video Gets Viral
X

చేతిలోఉన్న బాబును విసిరేసిన మహిళా (ట్విట్టర్ ఇమేజ్)

Viral Video: ఇంటర్నెట్ ప్రతిరోజూ ఏదో ఒక విచిత్రాన్ని చూడవచ్చు. ఒక ఫోటో లేదా వీడియో ఇంటర్నెట్‌లో రాత్రిపూట వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఎందరి ఇళ్లకో చేరుకుంటుంది. కొన్నిసార్లు ఈ వీడియోలు ఫన్నీగా ఉంటాయి. కొన్నిసార్లు షాకింగ్ గా ఉంటాయి. ఒక వీడియో ఇప్పటికే వైరల్ అవుతోంది. ఒక్కోసారి మనం ఒక పని చేయబోయి ఇంకోటి చేస్తాం. అనుకోకుండా అది జరిగిపోతుంది. ఇటువంటిదే ఈ సంఘటన కూడా. దీనిలో ఒక మహిళ తన బిడ్డను చెత్తకు బదులుగా డస్ట్‌బిన్‌లో పడేసింది.

ఈ వీడియోలో, ఒక మహిళ తన ఇంటి నుంచి బయటకు వెళుతోంది. ఆమె ఒక చేతిలో తన బిడ్డను, మరొక చేతిలో చెత్త సంచిని పట్టుకుని ఉంది. అయితే ఆ మహిళ మళ్లీ లోపలికి వచ్చినప్పుడు, చెత్త ఇప్పటికీ ఆమె చేతిలో ఉంది కానీ శిశువు కనిపించలేదు. ఆమె ఆ విషయం తెలుసుకున్న వెంటనే కంగారుగా మళ్లీ వెనక్కి పరిగెత్తింది. పని పరధ్యానం.. శ్రద్ధ లేకపోవడం వల్ల ఆ మహిళ అనుకోకుండా శిశువును విసిరేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

క్రికెటర్ హర్భజన్ సింగ్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దానిలో శిఖర్‌ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రాథమికంగా చాలా పాతది. కానీ, ఇప్పుడు అది మళ్లీ వైరల్ అవుతోంది. చాలా మంది దానిపై వ్యాఖ్యలు, లైకుల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ భారతీయ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకున్నారు. శిఖర్ ధావన్‌ను ట్యాగ్ చేశారు. శిఖర్ కూడా అదే చేస్తారని రాశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story