Bore Well: బోరు బావిలో పడిపోయిన రెండేళ్ల చిన్నారి..

Bore Well: ర్మల్ జిల్లా నర్సాపూర్‌ మండల కేంద్రం కేజీబీవీలో ఘటన

Jyothi
Updated on: 4 April 2024 12:15 PM IST
A two-year-old girl Fell into a Bore Well
X

Bore Well: బోరు బావిలో పడిపోయిన రెండేళ్ల చిన్నారి.. 

Bore Well: కర్ణాటకలోని విజయపుర జిల్లా లచ్యాన్‌ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సాత్విక్ అనే రెండేళ్ల చిన్నారి ఇంటి ఆవరణలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బోర్‌వెల్ నుంచి చిన్నారిని బయటకు తీసేందుకు రెస్య్యూ ఆపరేషన్ చేపట్టారు.

అయితే చిన్నారి దాదాపు 20 అడుగుల లోతులో కూరుకుపోయినట్లు రెస్క్యూ అధికారులు భావిస్తున్నారు. బోరు బావిలో చిన్నారి పరిస్థితిని తెలుసుకునేందుకు కెమెరాతో పాటు ఆక్సిజన్‌ను పైపు ద్వారా పంపించారు. ఘటనాస్థలం దగ్గర మెడికల్ సిబ్బంది, అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. ఇక బోరుబావికి సమాంతరంగా గుంత తీసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story