Congress: కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు.. కమల్‌‌నాథ్‌ బాటలోనే మనీష్ తివారీ..?

Congress: పార్టీ మార్పు ప్రచారంపై స్పందించని కమల్‌నాథ్‌, మనీష్ తివారీ

Shekhar G
Published on: 18 Feb 2024 11:11 AM IST
A Series Of Shocks For The Congress Party
X

Congress: కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు.. కమల్‌‌నాథ్‌ బాటలోనే మనీష్ తివారీ..?

Congress: లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌ నాథ్‌ బీజేపీలోకి చేరతారంటూ ప్రచారం జరుగుతుండగా.. పంజాబ్‌కు చెందిన ఓ సీనియర్ నేత కూడా ‍ఆయన బాటలోనే వెళ్తున్నట్టు సమాచారం. పంజాబ్‌కు చెందిన ఆనంద్‌పూర్‌ సాహిబ్ ఎంపీ మనీష్ తివారీ కమలం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పంజాబ్‌లోని లూథియానా నుంచి ఆయన పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story