Puducherry: 40 ఏళ్ల తర్వాత పుదుచ్చేరి క్యాబినెట్‌లో మహిళకు చోటు

Puducherry: 1980-1983 మ‌ధ్య కాంగ్రెస్-డీఎంకే కూటమి క్యాబినెట్‌లో డీఎంకేకు చెందిన మ‌హిళా నాయ‌కురాలు రేణుక అప్పాదురై మంత్రిగా పనిచేశారు

Sandeep Eggoju
Updated on: 27 Jun 2021 7:45 PM IST
Chandirapriyanga
X

చంద్రియాప్రియాంకా (ఫైల్ ఇమేజ్)

Puducherry: పుదుచ్చేరి క్యాబినెట్‌లో దాదాపు 40 ఏళ్ల త‌ర్వాత తొలిసారి ఒక మ‌హిళ‌కు స్థానం ల‌భించింది. 1980-1983 మ‌ధ్య కాంగ్రెస్-డీఎంకే కూటమి క్యాబినెట్‌లో డీఎంకేకు చెందిన మ‌హిళా నాయ‌కురాలు రేణుక అప్పాదురై మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పుదుచ్చేరి క్యాబినెట్‌లో మహిళలకు మంత్రి పదవి దక్కలేదు. తాజాగా రంగ‌స్వామి క్యాబినెట్‌లో మ‌హిళ‌కు చోటుద‌క్కింది. కారైక్కాల్‌ ప్రాంతంలోని నెడుంగాడు రిజర్వ్‌డ్‌ స్థానం నుంచి ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన చంద్రప్రియాంకని మంత్రి పదవి వ‌రించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story