స్నేహితుడి పెళ్లికోసం ర్యాలీగా వెళుతుంటే.. కారు చేసిన బీభత్సం చూడండి!

పాపం..పెళ్లి కి వెళదామని వచ్చి ప్రమాదం పాలయ్యారు.

K V D Varma
Published on: 22 Nov 2019 2:32 PM IST
స్నేహితుడి పెళ్లికోసం ర్యాలీగా వెళుతుంటే.. కారు చేసిన బీభత్సం చూడండి!
X
Car terror screen shots taken from Nisha Purushothaman Tweet video

వారంతా స్నేహితుని వివాహం కోసం సరదాగా వెళ్లారు. పెళ్లి లో సంబరంగా బైక్ ర్యాలీ చేద్దామని ఊరంతా బైక్ పై చక్కర్లు కొట్టారు. సరదాగా పెళ్ళికి వెళుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ కారు వేగంగా వచ్చి ర్యాలీ ని డీ కొట్టింది.

అంతే..బైక్ ల పై వెళుతున్న వారు అంత ఎత్తు ఎగిరి కింద పడిపోయారు. ఈ కారు బీభత్సం చూసిన స్థానికులు నిశ్చేష్టులయ్యారు. ర్యాలీ ని వీడియో తీస్తున్న సమయంలో ఈ సంఘటన కూడా రికార్డ్ అయింది. ఇదంతా కేరళలోని కాసరగోడులో జరిగింది. ఈ వీడియోను కేరళకు చెందిన నిషా పురుషోత్తమన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు చూడండి కారు చేసిన బీభత్సం!



K V D Varma

K V D Varma

Next Story