Blast In Delhi: ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ స్కూల్ దగ్గర పేలుడు

Blast In Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ స్కూల్ దగ్గర పేలుడు సంభవించింది. పేలుడుకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 Oct 2024 10:34 AM IST
A Blast was Heard Outside CRPF School in Delhi
X

Blast In Delhi: ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ స్కూల్ దగ్గర పేలుడు

Blast In Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ స్కూల్ దగ్గర పేలుడు సంభవించింది. పేలుడుకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. స్వల్ప తీవ్రత కలిగిన పేలుడుగా నిర్ధారించారు. ఉదయం 7.30గంటల సమయంలో ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. పేలుడుకు అసలు కారణాలను తెలుసుకునేందుకు నిపుణులను పిలిపించామని రోహిణి డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు.

ప్రస్తుతం ఇది ఏ రకమైన పేలుడు, దాని మూలం ఏమిటో స్పష్టంగా తెలియలేదు. ఘటనపై నిపుణుల బృందం సమగ్ర విచారణ చేస్తోందని, త్వరలోనే పరిస్థితి తేలనుందని డీసీపీ తెలిపారు. పేలుడు శబ్ధం పెద్దగా వినిపించడంతో సమీపంలోని వాహనాల అద్దాలు కూడా పగిలిపోయాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సిఆర్‌పిఎఫ్ పాఠశాల గోడ చుట్టూ కొన్ని దుకాణాలు ఉన్నాయి. అయితే అక్కడి వారు సిలిండర్ పేలుడు సంభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ, ఇంకా స్పష్టంగా ఏమీ వెల్లడి కాలేదు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story