Corona Cases in India: దేశంలో కొత్తగా 92,596 కరోనా కేసులు.. రికార్డు స్థాయిలో మరణాలు

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది.

Arun Chilukuri
Published on: 10 Jun 2021 10:09 AM IST
92,596 New Corona Cases Reported in India on 10th June 2021
X

కరోనా(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )


Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరణాలు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 94,052 కేసులు నమోదు కాగా, 6,148 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,51,367 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 3,59,676 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 11,67,952 క్రియాశీల కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 23,90,58,360 డోసులు వేసినట్లు చెప్పింది. నిన్న ఒకే రోజు 20,04,690 దేశవ్యాప్తంగా కరోనా నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఈ నెల 9వ తేదీ వరకు 37,21,98,253 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story