Corona Cases in India: దేశంలో కొత్తగా 91,702 కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది.

Arun Chilukuri
Published on: 11 Jun 2021 10:08 AM IST
91,702 New Corona Cases Reported in India on 11th June 2021
X

Corona Cases in India: దేశంలో కొత్తగా 91,702 కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 91,702 కేసులు నమోదు కాగా, 3,403 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,34,580 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 3,63,079 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 11,21,671 క్రియాశీల కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 24,60,85,649 డోసులు వేసినట్లు చెప్పింది. నిన్న ఒకే రోజు 20,44,131 దేశవ్యాప్తంగా కరోనా నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story