Corona Cases in India: దేశంలో కొత్తగా 86,498 కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది.

Arun Chilukuri
Published on: 8 Jun 2021 9:49 AM IST
86,498 New Corona Cases Reported in India on 8th June 2021
X

కరోనా(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )


Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. సుమారు 63 రోజుల తరవాత కొత్త కేసులు లక్షకు దిగువకు చేరాయి. దేశంలో కేసుల సంఖ్య 2.89కోట్లకు చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 86,498 కేసులు నమోదు కాగా, 2,123 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,82,282 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

వీరిలో ఇప్పటి వరకు 3,51,309 మంది మరణించగా.. మొత్తంగా వైరస్‌ను జయించినవారి సంఖ్య 2,73,41,462(94.29శాతం)కి చేరింది. క్రియాశీల కేసులు 13లక్షలకు చేరాయి. క్రియాశీల రేటు 4.50 శాతానికి తగ్గింది. మరోవైపు, నిన్న 33,64,476 మందికి టీకాలు ఇచ్చారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 23,61,98,726కి చేరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story