హవ్వ..! ఆ ముసలోడికి మన పీవీ సింధు తో పెళ్లి కావాలట!!

ఇదో పిచ్చి తలకెక్కిన ముసలోడి వేషం. తమిళనాడుకు చెందిన ఈతగాడి వెర్రి తనం వింటే మీరూ ఆశ్చర్యపోతారు!

K V D Varma
Updated on: 17 Sept 2019 4:06 PM IST
హవ్వ..! ఆ ముసలోడికి మన పీవీ సింధు తో పెళ్లి కావాలట!!
X

ప్రపంచ బ్యాడ్మింటన్ సంచలనం.. తెలుగు తేజం పీవీ సింధుతో తనకు పెళ్లి జరిపించాలంటూ ఓ 70 ఏళ్ల ముసలి వ్యక్తి ఏకంగా జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం వారం వారం నిర్వహించే కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన విని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

తమిళనాడు లోని రామనాధపురం జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలు పరిష్కారం కోసం వేదిక నిర్వహిస్తున్నారు. ఇంతలో అక్కడికి 70 ఏళ్ల మలైస్వామి అనే వృద్ధుడు వ్యక్తి వచ్చాడు. వస్తూనే కలెక్టర్ కు పీవీ సింధు, తను ఉన్న ఓ ఫోటో తో కూడిన అర్జీ ఇచ్చాడు. ఆ అర్జీ చదివిన కలెక్టర్ సహాయకులకు కొంత సేపు ఏమీ అర్థం కాలేదు. ఇంతకీ ఆ అర్జీలో ఇలా ఉంది.. తాను సింధు వీరాభిమాని అని, ఆమె ఆట తీరు తనని ఎంతో ఆకట్టుకుందని ఉంది. అందుకే తనకు ఆమెతో వివాహం జరిపించాలని కోరాడు. అంతే కాదు అందులో తన వయసు 16 ఏళ్లుగా చెప్పుకున్నాడు. తాను 2004 ఏప్రిల్, 4న పుట్టానని చెప్పాడు. ఒకవేళ తనకు సింధు తో పెళ్లి జరిపించకపోతే, ఆమెను ఎత్తుకుపోయి అయినా సరే తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో కలెక్టర్ తో పాటు విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆయనకు సర్ది చెప్పడానికి వారు ప్రయత్నించినా అతను మాత్రం మాట వినకుండా తనకు సింధు తో పెల్లిచేయాల్సిందే అని పట్టు పడుతున్నాడట. వెర్రి వెయ్యి విధాలు అంటే ఇదే మరి.


K V D Varma

K V D Varma

Next Story