Road Accident: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆడి క్యూ3 కారు

Sandeep Eggoju
Published on: 31 Aug 2021 11:27 AM IST
7 People Died in Bengaluru Car Accident
X
బెంగళూరు లో ఘోర కారు ప్రమాదం (ఫైల్ ఇమేజ్)

Road Accident: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరమంగళ ప్రాంతతంలో ఆడి క్యూ3 కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. తమిళనాడులోని హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై. ప్రకాశ్‌ కుమారుడు కరుణసాగర్‌, కోడలు బిందు సహా ఏడుగురు మృతి చెందారు. ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు కష్టపడాల్సి వచ్చింది. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story