Mumbai: మీటర్ బాక్స్ లో చెలరేగిన మంటలు.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవదహనం

Mumbai: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Oct 2024 10:25 AM IST
Mumbai: మీటర్ బాక్స్ లో చెలరేగిన మంటలు.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవదహనం
X

Mumbai: మీటర్ బాక్స్ లో చెలరేగిన మంటలు.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవదహనం

Mumbai: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. చెంబూరు ప్రాంతంలోని ఓ భవనంలో మీటర్ బాక్స్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటలు భవనం అంతటా వ్యాపించాయి. భవనంపై అంతస్తులో నివాసం ఉంటున్న ఒకే కుటుంబం మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మంటలు వ్యాపించిన సమయంలో ఆ కుటుంబం నిద్రలో ఉండడంతో తప్పించుకోలేకపోయారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story