Corona Cases in India: దేశంలో కొత్తగా 62,480 కరోనా కేసులు

Corona Cases in India: దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.

Arun Chilukuri
Published on: 18 Jun 2021 10:00 AM IST
62,480 New Corona Cases Reported in India on 18th June 2021
X

కరోనా టెస్ట్ (ఫైల్ ఇమేజ్ )

Corona Cases in India: దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గత 13రోజులుగా భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు అదుపులోనే ఉంటున్నాయి. మరణాలు కూడా తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది.

భారత్ లో కొత్తగా 62వేల 480 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,587 మంది కరోనాతో మృతి చెందారు. కొత్తగా 88,977 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,97,62,793కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 2,85,80,647 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 7,98,656 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. టీకా డైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 26,89,60,399 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 38.71 కోట్ల నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story