Corona Cases in India: దేశంలో కొత్తగా 60,471 కరోనా కేసులు

Corona Cases in India: దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 15 Jun 2021 12:34 PM IST
60,471 New Corona Cases Reported in India on 15th June 2021
X

కరోనా(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )

Corona Cases in India: దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. దాదాపు 72 రోజుల తర్వాత దేశంలో అతితక్కువ కేసులు నమోదు కావడం ఇదే. గత 10రోజులుగా భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతున్నా కోవిడ్ కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి వస్తున్నాయి.

భారత్ లో కొత్తగా 60వేల 471 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2వేల 726 మంది కరోనాతో మృతి చెందారు. కొత్తగా లక్షా 17వేల 525 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 2కోట్ల 82లక్షల 80వేల 472 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 9లక్షల 13వేల 378 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2కోట్ల 95లక్షల 70వేల 881కి చేరాయి. టీకా డ్రైవ్‌లో భాగంగా 25,90,44,072 డోసులు వేసినట్లు వివరించింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story