Mumbai: ముంబైలో 51 శాతం పిల్లల్లో కోవిడ్ యాంటీబాడీలు

51 Percent Children Have Antibodies in Mumbai
x

Source: Times of india

Highlights

Mumbai: ఇప్పటికే సగానికి పైగా పిల్లలకు వైరస్ సోకినట్లు సీరో సర్వేలో వెల్లడి

Mumbai: ముంబైలో యాభై శాతం మంది పిల్లలకు కోవిడ్ వైరస్ ఇప్పటికే సోకిందని తాజాగా ఓ సర్వే వెల్లడించింది. థర్డ్‌వేవ్‌ వస్తే పిల్లలపై ప్రభావం చూపించే అవకాశం ఉందన్న హెచ్చరికలతో బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ సీరో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 51శాతం పిల్లల్లో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నాయి. దీంతో అక్కడ సగానికిపైగా పిల్లలు వైరస్‌ ప్రభావానికి లోనైనట్లు సర్వే వెల్లడించింది.

రెండో వేవ్‌ కొనసాగుతున్న సమయంలో 1 నుంచి 18ఏళ్ల పిల్లలపై వైరస్‌ ప్రభావం ఏవిధంగా ఉందని తెలుసుకునేందుకు ముంబయి మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సర్వే చేశారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ 15 వరకు చేసిన సర్వేలో 2వేల 176 మంది చిన్నారుల నుంచి నమూనాలను సేకరించారు. ఈ శాంపిల్స్ పరీక్షించగా.. దాదాపు 51.1శాతం నమూనాల్లో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories