Corona Cases in India: కొత్తగా 50,040 మందికి కరోనా పాజిటివ్‌

Corona Cases in India: భారత్‌లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు

Sandeep Eggoju
Published on: 27 Jun 2021 12:06 PM IST
50,040 New Coronavirus Reported in India Today 27 26 2021
X

Representational Image 

Corona Cases in India: భారత్‌లో కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 50వేల 40 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. గడిచిన 24గంటల్లో 12 వందల 58 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి.. దేశంలో మొత్తం కరోనా కేసులు 3కోట్ల 2లక్షల 33వేల 183కు చేరాయి. ఇక.. కరోనా బారిన పడి ఇప్పటివరకు 3లక్షల 95వేల 751 మంది మృతి చెందినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. వైరస్‌ బారి నుంచి కోలుకుని, వివిధ ఆస్పత్రుల నుంచి 2కోట్ల 92లక్షల 51వేల 29 మంది డిశ్చార్జ్‌ కాగా.. భారత్‌లో ప్రస్తుతం 5లక్షల 86వేల 403 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story