Delhi: 50 వేల మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ దిగుమతి

Delhi:(File Image)
Delhi: 50 వేల మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Delhi: భారత దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ చుట్టేస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా కరోనా రోగులతో ఆసుప్రతులు నిండి పోతున్నాయి. ఇటు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుప్రతులు అనే తేడా లేకుండా కరోనా రోగులతో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుత అవసరాల దృష్ట్యా 50 వేల మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీలో గురువారం సమావేశమైన సాధికార బృందం ఈ నిర్ణయం తీసుకొంది. ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నదీ త్వరగా గుర్తించాలని విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని రాయబార కార్యాలయాలను నిర్దేశించింది.
దేశంలోని 100 ఆసుపత్రుల్లో సొంతంగా ఆక్సిజన్ తయారు చేసుకొనేలా ప్రోత్సహించనున్నారు. పీఎం కేర్స్ కింద ఇప్పటికే మంజూరుచేసిన 162 పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియను పరిశీలించి దాన్ని వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మారుమూల ప్రాంతాల్లో 100 ఆసుపత్రులను గుర్తించి అక్కడ పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సాధికార బృందం అధికారులను ఆదేశించింది.
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Apples: పరగడుపున యాపిల్ తింటే అద్భుతమైన ప్రయోజనాలు..!
30 Jun 2022 12:30 AM GMTBihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMT