Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ మొదలైన హింస.. ఐదుగురు మృతి

Manipur Violence: జిరిబామ్‌ జిల్లాలో ఐదుగురు మృతి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Sept 2024 5:13 PM IST
5 killed fresh violence Manipur Jiribam
X

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ మొదలైన హింస.. ఐదుగురు మృతి

Manipur Violence: మణిపూర్‌లో హింసాకాండ చల్లారడం లేదు. స్థానిక తెగలు మైతేయిలు, కూకీల మధ్య ఘర్షణ, వారికి వేర్పాటు వాదులు అగ్నికి ఆజ్యంలా తోడవ్వడంతో ఎప్పుడూ ఎక్కడో చోట ఆందోళనకర ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరోసారి మణిపూర్‌లో హింస చెలరేగింది. జిరిబామ్‌ జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. తొలుత ఓ వ్యక్తిని దుండగులు నిద్రలోనే కాల్చి చంపగా.. ఇదికాస్త ఇరువర్గాల మధ్య కాల్పులకు దారితీసింది. ఈ క్రమంలోనే మరో నలుగురు సాయుధులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. చూరాచాంద్‌పుర్‌లో మిలిటెంట్లకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బిష్ణుపుర్‌ జిల్లాలో రాకెట్‌ దాడులను ఇక్కడినుంచే చేపట్టినట్లు సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story