Corona Cases in India: దేశంలో కొత్తగా 48,786 కరోనా కేసులు

Corona Cases in India: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 1 July 2021 1:34 PM IST
48,786 New Corona Cases Reported in India on 1st July 2021
X

దేశంలో కొత్తగా 48,786 కరోనా కేసులు

Corona Cases in India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇటీవల 40వేల దిగువకు పడిపోయిన కేసులు వరుసగా రెండోరోజు పెరిగాయి. మరణాలు కూడా మరోసారి 1,000 మార్కును దాటాయి. భారత్‌లో కొత్తగా 48వేల 786 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముందు రోజుతో పోలిస్తే 6 శాతం పెరుగుదల కనిపించింది. కరోనా బారినపడి 24 గంటల్లో 1,005 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు మరణాల సంఖ్య 817గా ఉంది. ఇప్పటి వరకు 3కోట్ల 04 లక్షల 11వేల 634 మందికి కరోనా సోకగా 3లక్షల 99వేల 459 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 5,23,257 మంది కొవిడ్‌తో ఇబ్బంది పడుతున్నారు. దేశంలో యాక్టీవ్‌ రేటు 1.77 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 96.92 శాతానికి పెరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story