దేశంలో కొత్తగా 45,576 కరోనా కేసులు!

గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 45,576 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Krishna
Published on: 19 Nov 2020 10:15 AM IST
దేశంలో కొత్తగా 45,576 కరోనా కేసులు!
X

గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 45,576 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసుల సంఖ్య 89,58,484కు చేరుకుంది. అయితే ఇందులో 83,83,603 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,43,303 మంది చికిత్స పొందుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 48,493 కరోనా నుంచి కోలుకున్నారు. అటు కొత్తగా 585 మంది మరణించారు. దీనితో మృతుల సంఖ్య 1,31,578కి చేరుకుంది. ఇక ఇప్పటివరకు 12,85,08,389 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ ని విడుదల చేసింది.

Krishna

Krishna

Next Story