Corona Cases in India: దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు

Corona Cases in India: భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

Arun Chilukuri
Published on: 10 July 2021 9:55 AM IST
Corona Cases in India: 42,766 New Corona Cases Reported in India on 10TH July 2021
X

Corona Cases in India: దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు

Corona Cases in India: భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. భారత్‌లో కొత్తగా 42 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1206 మంది మృతి చెందారు. గత కొద్దికాలంగా వెయ్యికి దిగువనే నమోదవుతోన్న మరణాలు నిన్న భారీగా పెరిగాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 3,07,95,716 చేరగా.. 4,07,145 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

నిన్న 19,55,225 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక 24 గంటల వ్యవధిలో 45,254 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.99 కోట్లకు చేరగా.. ఆ రేటు 97.20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 4,55,033 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story