Corona Cases in India: దేశంలో కొత్తగా 42,640 కరోనా కేసులు

Corona Cases in India: భారత్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.

Arun Chilukuri
Published on: 22 Jun 2021 10:00 AM IST
42,640 New Corona Cases Reported in India on 22nd June 2021
X

Corona Cases in India: దేశంలో కొత్తగా 42,640 కరోనా కేసులు

Corona Cases in India: భారత్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. రోజువారీ కేసులు మూడు నెలల కనిష్ఠానికి చేరాయి. కొత్తగా దేశంలో 42వేల 640 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సుమారు 91 రోజుల తర్వాత తొలిసారి రోజువారీ కేసులు 50వేల దిగువకు చేరాయి. కరోనా మరణాలు కూడా భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,167 మంది మృతి చెందారు. కొత్తగా 78వేల 170 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,77,861కి చేరింది.

ఇందులో 2,89,26,038 మంది బాధితులు కోలుకోగా, 3,89,302 మంది మహమ్మారి వల్ల మరణించారు. మరో 6,62,521 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిన్నటి వరకు టీకా తీసుకొన్న వారి సంఖ్య 28,87,66,201కు చేరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story