Corona Cases in India: దేశంలో మళ్లీ పంజా విసురుతున్న మహమ్మారి

Corona Cases in India: భారత్‌లో తగ్గినట్టే తగ్గిన కోవిడ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

Arun Chilukuri
Published on: 21 July 2021 2:13 PM IST
42,015 New Coronavirus Cases Reported in India Today 21st July 2021
X

Corona Cases in India: దేశంలో మళ్లీ పంజా విసురుతున్న మహమ్మారి

Corona Cases in India: భారత్‌లో తగ్గినట్టే తగ్గిన కోవిడ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. కొత్తగా 42వేల 15 పాజిటివ్ కేసులు నమోదు కాగా అదే సమయంలో దాదాపు నాలుగు వేల మరణాలు నమోదకావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న 125రోజుల కనిష్టానికి పాజిటివ్ రేటు పడిపోగా 24గంటలు గడవక ముందే కేసులతో పాటు మరణాలు భారీగా పెరిగాయి. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3కోట్ల 12లక్షల 16వేల 337కు చేరుకుంది.

మరోవైపు దేశంలో కోవిడ్ మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సగటున 5వందల మరణాలు నమోదైతే ఇవాళ ఒక్కరోజే 3వేల 998మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో మరణాల సంఖ్య 4లక్షల 18వేల 480కు చేరుకుంది. దేశంలో థర్డ్‌వేవ్ కామెంట్స్ వినిపిస్తున్న వేళ తాజాగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు మరింత భయాందోళనలు రేపుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4లక్షల 7వేల 170 యాక్టివ్ కేసులున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story