Corona Cases in India: భారత్‌లో కొత్తగా 42, 618 కరోనా కేసులు

Corona Cases in India: 24 గంటల్లో కోవిడ్‌తో 330 మంది మృతి

Sandeep Eggoju
Published on: 4 Sept 2021 10:26 AM IST
42, 618 New Coronavirus Reported in India Today 04 09 2021
X
Representational Image

Corona Cases in India: భారత్‌లో మళ్లీ కోవిడ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అంతేకాదు.. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4లక్షల మార్క్‌ను దాటింది. దీంతో ప్రజలు మాస్క్‌ పెట్టుకోవడంతోపాటు భౌతిక దూరం పాటించాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేస్తోంది. ప్రజలు నిర్లక్ష్యం వ్యవహరించరాదని హెచ్చరికలు చేసింది. ప్రతీ ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటించకపోతే థర్డ్‌ వేవ్‌ ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.

24 గంటల్లో భారత్‌లో 42వేల 618 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4లక్షల 5వేల 681 చేరింది. 24 గంటల్లో కోవిడ్‌ బారిన పడి 330 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారిన సంఖ్య 4లక్షల 40వేలకుపైగా చేరుకుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story