Corona Cases in India: గడిచిన 24 గంటల్లో 41,965 కొత్త కేసులు
Corona Cases in India: నిన్న కాస్త తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు
Representational image
Corona Cases in India: దేశంలో మరోసారి కరోనా కలవరానికి గురి చేస్తోంది. నిన్న తగ్గినట్టే కనిపించిన కరోనా పాజిటివ్ కేసులు ఇవాళ మరోసారి పెరిగాయి. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 41 వేల 965 కొత్త కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో రెండొంతులకు పైన కేసులు ఒక్క కేరళలోనే నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. ఆ రాష్ట్రంలో 30 వేల 203 కేసులు బయటపడ్డాయి. తాజాగా నమోదు అయిన కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.28 కోట్లు దాటింది.
మరోవైపు. 24 గంటల వ్యవధిలో 33 వేల 964 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3.19 కోట్ల మందికి పైనే కరోనాను జయించగా రికవరీ రేటు 97.51 శాతానికి చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో మరో 460 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒక్క 115 మరణాలు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనాతో 4లక్షల 39 వేల 20 మంది ప్రాణాలు కోల్పోయారు కొత్త కేసులు పెరగడంతో క్రియాశీల కేసులు కూడా ఎక్కువవుతున్నాయి. దేశ వ్యాప్తంగా 3 లక్షల 78వేలకు పైగా యాక్టివ్ కేసులున్నట్టు కేంద్రం వెల్లడించింది.




