logo
జాతీయం

Corona Cases in India: భారత్‌లో కొత్తగా 41,806 కరోనా కేసులు

41,806 New Corona Cases Reported in India on 15th July 2021
X

కరోనా(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )


Highlights

Corona Cases in India: భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

Corona Cases in India: భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 3,09,87,880కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 41,806 కేసులు నమోదు కాగా, 581 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 39,130 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

వీరిలో ఇప్పటి వరకు 4,11,989 మంది మరణించగా.. 3,01,43,850 మంది కోలుకున్నారు. దేశంలో 97.28 శాతం కరోనా రోగుల రికవరీ రేటు. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 1.39 శాతం. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.33 శాతం. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 19,43,488. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 34,97,058 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Web TitleCorona Cases in India: 41,806 New Corona Cases Reported in India on 15th July 2021
Next Story