Corona Cases in India: భారత్‌లో కొత్తగా 41,195 కరోనా కేసులు నమోదు

Corona Cases in India: దేశవ్యాప్తంగా 3,20,76,976కి చేరిన కరోనా కేసులు * దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 4,29,702 మంది మృతి

Sandeep Eggoju
Published on: 12 Aug 2021 10:06 AM IST
41,195 New Corona Cases Reported in India on 12th August 2021
X

Representational Image

Corona Cases in India: భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్యలో పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 41వేల 195 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఈ సంఖ్య 38వేల 353గా ఉంది. ప్రస్తుతం దేశంలో 3 లక్షల, 87వేల, 987 కరోనా యాక్టివ్‌ కేసులున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా కేరళలో 23వేల 500 కేసులు నమోదుకాగా 5వేల 560 కొవిడ్ కేసులతో మహారాష్ట్ర రెండోస్థానంలో ఉంది. కరోనా రికవరీ రేటు 97.45 శాతంగా ఉంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story