Corona Cases in India: 4 లక్షలు దాటిన రోజువారీ కరోనా కేసులు

Corona Cases in India: దేశంలో రోజు రోజుకూ రికార్డు స్థాయి కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

Kranthi
Published on: 1 May 2021 10:37 AM IST
4,01,993 New Corona Cases in India Today Reported 01 05 2021
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దేశం నలుమూలలా వైరస్ విరుచుకుపడుతోంది. మునుపెన్నడూ లేనంత ఉధృతితో వ్యాపిస్తుండటంతో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4 లక్షలు దాటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒక రోజులో ఇంత అత్యధిక కేసులు నమోదవడం, అదీ భారత్ లోనే చోటు చేసుకోవడం పరిస్థతి తీవ్రతను తెలుపుతోంది. గత 24 గంటల్లో శుక్రవారం.. 4,01,993 కేసులు నమోదయ్యాయి.

ఈ మహమ్మారి కారణంగా 3,523 మంది బాధితులు మరణించారు. తాజాగా నమోదైన కేసుల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,64,969 (1.91 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 2,11,853 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా దేశంలో కరోనా ప్రారంభమైన నాటినుంచి ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

ఇదిలాఉంటే.. శుక్రవారం కరోనా నుంచి 2,99,988 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,56,84,406 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 32,68,710 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 81.84 శాతం ఉండగా మరణాల రేటు 1.11 శాతం ఉంది ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ముమ్మరంగా కొనసాగుతోంది.

వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15,49,89,635 డోసులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాగా.. నేటి నుంచి భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 19,45,299 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 30 వరకు మొత్తం 28,83,37,385 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ వెల్లడించింది.

Kranthi

Kranthi

Next Story