Corona Cases in India: దేశంలో కొత్తగా 37,154 మందికి పాజిటివ్ నిర్ధారణ

* 24 గంటల్లో 724మంది కరోనాతో మృతి * దేశవ్యాప్తంగా 4,50,899 యాక్టివ్ కేసులు

Sandeep Reddy
Updated on: 12 July 2021 9:30 PM IST
37,154 Positive Corona Cases Today in India
X

కరోనా వైరస్ 

Corona Cases in India: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక్కరోజులో 37వేల 154మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, గడిచిన 24గంటల్లో 39వేల 649మంది కోవిడ్‌ను జయించినట్లు తెలిపింది. పెరిగిన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 8లక్షల 74వేల 376కు చేరింది. మరోవైపు నిన్న ఒక్కరోజే 724మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 4లక్షల 8వేల 764కు పెరిగింది. దేశంలో ఇప్పటివరకూ 3కోట్ల 14లక్షల 713మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం 4లక్షల 50వేల 899మంది చికిత్స పొందుతున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story