Corona Cases in India: కొత్తగా 36,976 పాజిటివ్‌ కేసులు

Corona Cases in India: దేశంలో 3,05,85,229కి చేరిన కరోనా కేసులు * కరోనాతో ఇప్పటివరకు 4,02,728 మంది మృతి

Sandeep Eggoju
Published on: 5 July 2021 10:59 AM IST
36,976 New Coronavirus Reported in India Today 05 07 2021
X

Representational Image

Corona Cases in India: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి.. కాస్త తగ్గుముఖం పట్టింది. 50వేలకు దిగువన రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 36వేల 976 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3కోట్ల 5లక్షల 85వేల 229 మంది.. కరోనా బారిన పడ్డారు. ఇక.. గత 24 గంటల్లో కోవిడ్‌తో 723 మంది మృతి చెందడంతో.. భారత్‌లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4లక్షల 2వేల 728కి చేరింది.

ఇప్పటివరకు 2కోట్ల 97లక్షల 430 మంది మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరగా.. ప్రస్తుతం 4లక్షల 82వేల 71 మంది చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 97.11 శాతంగాను, మరణాల రేటు 1.32 శాతంగాను నమోదు కాగా.. భారత్‌లో ఇప్పటివరకు 35కోట్ల 28 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story