భారత్‌లో కొత్త‌గా 36,594 కరోనా పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 4 Dec 2020 10:01 AM IST
భారత్‌లో కొత్త‌గా 36,594 కరోనా పాజిటివ్ కేసులు
X

India: భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 95 లక్షల 71 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 36,594 కేసులు నమోదు కాగా, 540 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 42,916 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 95,71,559 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,16,082 ఉండగా, 90,16,289 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,39,188 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 94.20 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.45 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 4.35 శాతంగా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story