Corona Cases in India: కొత్తగా 34,703 పాజిటివ్‌ కేసులు నమోదు

Corona Cases in India: గత 111 రోజుల కనిష్ఠానికి రోజువారీ పాజిటివ్‌ కేసులు * గడిచిన 24 గంటల్లో కరోనాతో 553 మంది మృతి

Sandeep Eggoju
Published on: 6 July 2021 10:19 AM IST
34,703 New Coronavirus Reported in India Today 06 07 2021
X

Representational image

Corona Cases in India: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి.. కాస్త తగ్గుముఖం పట్టింది. 40వేలకు దిగువన రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 34వేల 703 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గడిచిన నూట పదకొండు రోజుల కనిష్టానికి రోజువారీ పాజిటివ్‌ కేసులు చేరుకున్నాయి. ఇక.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3కోట్ల 6లక్షల 19వేల 932 మంది.. కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో కోవిడ్‌తో 553 మంది మృతి చెందడంతో.. భారత్‌లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4లక్షల 3వేల 281కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4లక్షల 64వేల 357 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 97.17 శాతంగాను, మరణాల రేటు 1.31 శాతంగాను నమోదైంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story