Corona Cases in India: 400కు దిగువగా మరణాలు

Corona Cases in India: భారత్ లో కరోనా ఉద్ధృతి అదుపులో ఉంది.

Arun Chilukuri
Published on: 21 Aug 2021 11:03 AM IST
34,457 New Coronavirus Cases Reported in India Today 21st August 2021
X

Corona Cases in India: 400కు దిగువగా మరణాలు

Corona Cases in India: భారత్ లో కరోనా ఉద్ధృతి అదుపులో ఉంది. ముందు రోజుతో పోల్చితే కొత్త కేసులు, మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేసులు 5.7 శాతం మేర తగ్గగా మృతుల సంఖ్య 400 దిగువకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా ఇవాళ 34వేల, 457 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. 24 గంటల వ్యవధిలో 375 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక మొత్తం కేసులు 3.23 కోట్ల మార్కును దాటగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4.33లక్షలకు చేరింది. నిన్న 36 వేల మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3 లక్షల, 61వేల, 340గా ఉన్నాయి. మరోపక్క నిన్న 36.36లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 57,61,17,350గా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story