Corona Cases in India: 31,443 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ

Corona Cases in India: 118 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు * కరోనాతో 2,020 మంది మృతి

Sandeep Eggoju
Published on: 13 July 2021 12:36 PM IST
31,443 New Corona Cases Reported in India on 13th July 2021
X

Representational Image

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా కొత్త కేసులు తగ్గినప్పటికీ మరణాలు మాత్రం పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17 లక్షల 40 వేల మంది శాంపిల్స్ సేకరించగా వారిలో 31 వేల 443 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో 118 రోజుల కనిష్టానికి కొత్త కేసులు తగ్గినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఒకవైపు పాజిటివ్ కేసులు తగ్గుతున్నా మరణాలు మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24గంటల్లో 2వేల 20 మంది ప్రాణాలు కోల్పోయారు. గతకొన్ని రోజులులగా వెయ్యి లోపు నమోదు అయిన మరణాలు రెండు వేలకు పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మరణాల సంఖ్య 4లక్షల 10 వేలు దాటింది. మరోవైపు కరోనా నుంచి కోలుకుని 24గంటల్లో 49వేల మంది డిశ్చార్జ్ అయ్యారు దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.28 శాతానికి పెరగ్గా క్రియాశీల రేటు 1.40 శాతానికి తగ్గింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story