Covid Vaccine: కరోనా టీకా తీసుకున్న తర్వాత 30 నిమిషాలు కీలకం

Covid Vaccine: అందుకే 30 నిమిషాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలంటూ సూచన

Sandeep Eggoju
Published on: 24 Jun 2021 8:16 AM IST
30 Minutes After Taking the Corona Vaccine is Crucial
X

కరోన వాక్సినేషన్ (ఫైల్ ఇమేజ్)

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్‌లపై వస్తున్న అసత్య ప్రచారాలు, ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ సన్నద్ధం అయింది. అందుకోసం కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే.. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తొలి 30 నిమిషాలే అత్యంత కీలకమని, ఏవైనా ప్రమాదకర లేదంటే తీవ్ర దుష్రభావాలు ఎదురైతే అవి ఆ సమయంలోనే కనిపిస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అందుకే టీకా తీసుకున్న వారిని అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నామని స్పష్టం చేసింది. దేశ జనాభాలో ఇప్పటివరకు కేవలం 2.2 శాతం మాత్రమే వైరస్ బయటపడింది. మరో 97శాతం ప్రజలకు వైరస్ ముప్పు పొంచిఉన్నట్టేనని కేంద్ర అభిప్రాయపడుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story