భారత్‌లో కొత్త‌గా 24,010 కరోనా పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 17 Dec 2020 11:35 AM IST
భారత్‌లో కొత్త‌గా 24,010 కరోనా పాజిటివ్ కేసులు
X

India: భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కేసుల సంఖ్య 99 లక్షల 56 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 24,010 కేసులు నమోదు కాగా, 355 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 33,291 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 99,56,558 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,22,366 ఉండగా, 94,89,740 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,44,451 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 95.31 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.45 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 3.24 శాతంగా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story