Corona Cases in India: దేశంలో కొత్తగా 1,96,427 కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.

Arun Chilukuri
Published on: 25 May 2021 10:19 AM IST
Corona Cases in India
X

కరోనా వైరస్(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )

Corona Cases in India: భారత్‌లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా లక్షా 96 వేల 427 కేసులు నమోదయ్యాయి. ఇక కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. ఒక్కరోజులో 3 వేల 511 మంది మృతి చెందారు. దేశంలో కేసుల సంఖ్య 2,69,48,874కి చేరింది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,26,850 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

వీరిలో ఇప్పటి వరకు 3,07,231 మంది మరణించగా.. 2,40,54,861 మంది కోలుకున్నారు. దేశంలో 88.69 శాతం కరోనా రోగుల రికవరీ రేటు. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 10.17 శాతం. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.14 శాతం. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 20,58,112. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 24,30,236 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story