Coronavirus Updates in India: భారత్‌లో కొత్తగా 19,148 కరోనా పాజిటివ్‌ కేసులు

Arun Chilukuri
Published on: 2 July 2020 9:52 AM IST
Coronavirus Updates in India: భారత్‌లో కొత్తగా 19,148 కరోనా పాజిటివ్‌ కేసులు
X

Coronavirus Latest Updates: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,148 కేసులు నమోదు కాగా, 434 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 6,04,641 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,26,947 ఉండగా, 3,59,859 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 17,834 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,29,588 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 90,56,173 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story