Coronavirus Updates in India: భారత్‌లో కొత్తగా 18,653 కరోనా పాజిటివ్‌ కేసులు

Arun Chilukuri
Updated on: 1 July 2020 10:54 AM IST
Coronavirus Updates in India: భారత్‌లో కొత్తగా 18,653 కరోనా పాజిటివ్‌ కేసులు
X

Coronavirus Latest Updates: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 18,653 కేసులు నమోదు కాగా, 507 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 5,85,493 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,20,114 ఉండగా, 3,47,979 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 17,400 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,17,931 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 88,26,585 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story