Corona Updates: గడిచిన 24 గంటల్లో 18,327 కరోనా కేసులు నమోదు

Corona Updates: గడిచిన 24 గంటల్లో 18,327 కొత్త కేసులు నమోదయినట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Kranthi
Updated on: 6 March 2021 11:20 AM IST
Coronavirus 18,327 new corona cases were registered in the country
X

ఫైల్ ఇమేజ్


Coronavirus: దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నకరోనా కేసులు కలవర పెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,51,935 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 18,327 కొత్త కేసులు నమోదు కాగా 108 మంది మరణించినట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 1.11 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడగా.. 1,57,656 మరణాలు సంభవించాయి.

కరోనా సోకుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు ఎగబాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు లక్షా 80వేలకు పైబడ్డాయి. ఆ రేటు 1.61 శాతానికి పెరిగింది. ఈ మధ్యకాలంలో 97 శాతాన్ని దాటిన రికవరీ రేటు. ఇప్పుడు 96.98 శాతానికి పడిపోవడం గమనార్హం. నిన్న 14,234 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా..మొత్తంగా వైరస్‌ను జయించినవారి సంఖ్య 1,08,54,128కి చేరింది. కొవిడ్ టీకాల రాక, కేసులు తగ్గుదల కారణంగా ప్రజల్లో నెలకొన్న నిర్లక్ష్యం, ప్రభుత్వం దాదాపుగా అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడం.. తాజా విజృంభణకు కారణమని నిపుణులు అంటున్నారు. దేశవ్యాప్తంగా టీకాలు తీసుకున్న వారి సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది.

Kranthi

Kranthi

Next Story