Coronavirus: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోనే 1500 శాతం కేసులు

1500 Percent Cases with 5 State Assembly Elections
x

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Coronavirus: కొవిడ్ విస్తరిస్తోన్న పట్టించుకోని రాజకీయ నేతలు * ఏప్రిల్ 21నాటికి 53వేల యాక్టివ్ కేసులు

Coronavirus: ఒక పక్కన కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. జాగ్రత్తలు చెప్పాల్సిన రాజకీయ నేతలు వేలాది మందితో రోడ్డు ర్యాలీలు, లక్షలాది మందితో బహిరంగ సభలు నిర్వహించి కరోనా సూపర్ స్ప్రెడ్‌కు కారణం అయ్యారు.. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదు అన్ని పార్టీలలదీ అదే బాట.. ప్రచారంలో పాల్గొనే నేతల ముఖాలకు కనీసం మాస్క్‌లు కూడా ధరించలేదు. ర్యాలీలు, సభల్లో పాల్గొనే ప్రజల ముఖాలకూ మాస్కులు ఉండవు.. ఇక భౌతిక దూరం అనేది లేదు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 29 దాకా ఎనిమిది దశలపాటు సుదీర్ఘంగా ఎన్నికలు జరుగుతున్న బెంగాల్‌లో.. ఇప్పటికే ఎన్నికలు ముగిసిన తమిళనాడు, కేరళ, అసోంలలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఈ నిర్లక్ష్యంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్యం భారీగా పెరిగింది.

ఒక్క బెంగాల్‌లోనే కరోనా కేసులు నెల రోజుల వ్యవధిలో భారీగా పెరిగాయి. రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య ఏకంగా 15 వందల శాతం పెరిగింది. మార్చి 11 నాటికి బెంగాల్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 3వేల 110 నమోదు అయ్యాయి ఆ తర్వాత నుంచి భారీగా పెరిగి.. యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 53వేలకు చేరిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటిదాకా బెంగా‌ల్‌లో ఐదు దశల్లో 16 జిల్లాలో పోలింగ్ జరిగింది. వాటిలో కొన్ని ప్రధానమైన జిల్లాలోనే దాదాపు కేసుల సంఖ్య భారీగా పెరిగింది.

ఎన్నికల ప్రచారం దెబ్బకు తమిళనాడులో యాక్టివ్ కేసులు 62శాతం పెరిగితే అసోంలో 230 శాతం పెరిగాయి ఆ సమయంలో దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల పెరుగుదల 60.64గా నమోదు అయింది. దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఆ సమయంలో యాక్టివ్ కేసుల పెరుగుదల కేవలం 19.79 శాతం మాత్రమే నమోదు అయింది. అంటే ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల సభలు, ర్యాలీలు కేసుల ముప్పును ఎంతగా పెంచేశాయో అర్థం చేసుకోవచ్చు మరోవైపు ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్య భారీగా తగ్గించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిలో చాలా మంది వైరస్‌ బారిన పడి, వారి నుంచి ఇతరులకు సోకింది.

ఇటు నాగార్జున సాగర్‌ లోనూ కరోనా పాజిటివ్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. ఏప్రిల్ 17న ఉప ఎన్నిక జరగ్గా దానికి 4 నుంచి 5 రోజుల ముందు నుంచీ అన్ని పార్టీలూ విస్తృతంగా ప్రచారం చేశాయి.. దాంతో అక్కడ కేసులు పెరుగుతూ వచ్చి ఇప్పుడు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇక త్వరలోనే మునిసిపల్ ఎన్నికలు జరగనున్న మరో ఏడు ప్రాంతాల్లోనూ కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ముగిసే సమయానికి పెద్దపెద్ద వైరస్‌ సామూహిక విస్ఫోటాలు జరగొచ్చని వైద్యశాఖ అంచనా వేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories