Corona Cases in India: దేశంలో కొత్తగా 1,32,788 కరోనా కేసులు

1,32,788 New Corona Cases Reported in India on 2nd June 2021
x

కరోనా(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )

Highlights

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది.

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 2,83,07,832కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1,32,788 కేసులు నమోదు కాగా, 3,207 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,31,456 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

వీరిలో ఇప్పటి వరకు 3,35,102 మంది మరణించగా.. 2,61,79,085 మంది కోలుకున్నారు. దేశంలో 92.09 శాతం కరోనా రోగుల రికవరీ రేటు. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 6.73 శాతం. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.18 శాతం. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 20,19,773. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 23,97,191 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories