PM Modi's 74th Birthday: 13 ఏళ్ల చిన్నారి స్పెషల్ గిఫ్ట్..!

PM Modi's 74th Birthday: తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల బాలిక ప్రెస్లీ షెకీనా రికార్డు క్రియేట్ చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Sept 2024 5:15 PM IST
PM Modis 74th Birthday: 13 ఏళ్ల చిన్నారి స్పెషల్ గిఫ్ట్..!
X

PM Modi's 74th Birthday: 13 ఏళ్ల చిన్నారి స్పెషల్ గిఫ్ట్..!

PM Modi's 74th Birthday: తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల బాలిక ప్రెస్లీ షెకీనా రికార్డు క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 17న ప్రధాని మోడీ బర్త్‌డేను పురస్కరించుకుని తృణ ధాన్యాలతో ఆయన చిత్రాన్ని రూపొందించింది. అందుకోసం దాదాపు 12 గంటల పాటు శ్రమించి మోడీ చిత్రాన్ని తయారు చేసింది. చెన్నైలోని కోల్పాక్కం ప్రాంతానికి చెందిన ప్రెస్లీ షెకీనా చెన్నైలోని వెల్లమ్మాళ్ ప్రైవేట్‌ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. సెప్టెంబరు 17న ప్రధాని మోదీ పుట్టినరోజు కావడంతో తృణ ధాన్యాలతో ఆయన చిత్రాన్ని రూపొందించి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకొంది.

ఇందుకోసం 800 కిలోల మినుములను ఉపయోగించి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాని మోదీ భారీ చిత్రాన్ని గీసింది. చిత్రాన్ని పూర్తి చేయడానికి 12 గంటల పాటు శ్రమించింది. దీంతో ఆమె యూనికో వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్ ఆర్ శివరామన్ ప్రెస్లీ షెకీనాకు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్, మెడల్‌ను బహూకరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story