చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్: 12 మంది మావోల మృతి

ఛత్తీస్ ఘడ్ అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో గురువారం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మరణించారు

లోడె నర్సింహ్మ
Updated on: 12 Dec 2024 1:10 PM IST
Massive encounter in Karreguttala 22 Maoists killed
X

 Karregutta: కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..22 మంది మావోయిస్టులు దుర్మరణం

ఛత్తీస్ ఘడ్ అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో గురువారం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మరణించారు.బుధవారం రాత్రి నుంచి అబూజ్ మడ్ అటవీ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. గురువారం తెల్లవారుజాము నుంచి ఇరువర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.

అబూజ్ మడ్ తో పాటు రాష్ట్రంలో మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ను పెంచాయి. నెల రోజల వ్యవధిలో పోలీసుల కాల్పుల్లో సుమారు 60 మంది మావోయిస్టులు మరణించారు.కూంబింగ్ లో నారాయణపూర్, దంతెవాడ, జగదల్ పూర్, కొండగావ్ జిల్లాల భద్రతా బలగాలు పాల్గొన్నాయి.

కూంబింగ్ జరుపుతున్న తమ బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారని..ఈ సమయంలో ఇరువర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్ 22న కోంటా పరిధిలో జరిగిన ఎన్ కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు మరణించారు.ఈ నెల 8న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఓ మావోయిస్టు మరణించారు.

లోడె నర్సింహ్మ

లోడె నర్సింహ్మ

Next Story