Corona Cases in India: దేశంలో కొత్తగా 1,14,460 కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది.

Arun Chilukuri
Published on: 6 Jun 2021 10:13 AM IST
1,14,460 New Corona Cases Reported in India on 6th June 2021
X

Corona Cases in India: దేశంలో కొత్తగా 1,14,460 కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 2,88,09,339కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1,14,460 కేసులు నమోదు కాగా, 2,677 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,89,232 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

వీరిలో ఇప్పటి వరకు 3,46,759 మంది మరణించగా.. ఇప్పటివరకు 2,69,84,781 మంది కోలుకున్నారు. దేశంలో 93.67 శాతం కరోనా రోగుల రికవరీ రేటు. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 5.13 శాతం. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.18 శాతం. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 20,36,311. దేశంలో వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 23,13,22,417 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story