Corona Cases in India: దేశంలో కొత్తగా 1,00,636 కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది.

Arun Chilukuri
Published on: 7 Jun 2021 9:58 AM IST
1,00,636 New Corona Cases Reported in India on 7th June 2021
X

కరోనా(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )


Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 2,89,09,975కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1,00,636 కేసులు నమోదు కాగా, 2,427 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,74,399 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

వీరిలో ఇప్పటి వరకు 3,49,186 మంది మరణించగా.. ఇక రికవరీలు 2.7కోట్ల మార్కును దాటాయి. రికవరీ రేటు 94 శాతానికి చేరువగా కాగా..క్రియాశీల రేటు 5శాతం దిగువకు నమోదైంది. ప్రస్తుతం 14,01,609 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మరోవైపు ఆదివారం 13.90లక్షల మందికి టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 23 కోట్లకు పైబడింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story